Site icon NTV Telugu

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయి: టీజీ వెంకటేష్‌

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయని టీజీ వెంకటేష్‌ అన్నారు. ఈ సందర్భంగా కర్నూల్‌లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆలయాలపై దాడులను వ్యతిరేకిస్తే బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. 80 శాతం హిందువులున్నా 20 శాతం ఉన్న మైనార్టీలకు రాజ్యాంగంలో రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. భారతీయులంతా అన్నదమ్ములు అని మైనార్టీలు భావించాలన్నారు.

Read Also: సీఎం తుగ్లక్‌ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు: అయ్యన్న పాత్రుడు

మైనార్టీలకు ఇక్కడ ఉన్న రక్షణ ఎక్కడ లేదన్నారు. మైనార్టీల్లో అతికొద్ది మాత్రమే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఇది మైనార్టీలు గుర్తించాలన్నారు. హిందువులకు న్యాయం జరిగినపుడు ప్రశ్నిస్తే మతోన్మాదం ముద్ర వేస్తారన్నారు. ఆత్మకూరులో తీవ్రవాద భావాలున్న వారు కొందరూ పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారన్నారు. హిందువులు, మైనార్టీలు అన్నదమ్ముల్లా బతకాలని టీజీ వెంకటేష్‌ సూచించారు. మైనార్టీ సోదరులు అందరూ తప్పు చేయడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం నిలదొక్కుకొని ఉందంటే బీజేపీ ఆశీర్వాదం ఉన్నందుకే అన్న విషయం గుర్తుంచుకోవాలని టీజీ వెంకటేష్‌ అన్నారు. మూడేళ్లు ముగిసింది…బీజేపీ ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పోరాడాలని టీజీవెంకటేష్ అన్నారు.

Exit mobile version