NTV Telugu Site icon

Gudivada Tension: గుడివాడలో టెన్షన్.. టెన్షన్

166891e4 C1ee 42f2 A7c8 B8eb39be3874

166891e4 C1ee 42f2 A7c8 B8eb39be3874

విజయవాడ రాజకీయాలంటే హాట్ హాట్ గా ఉంటాయి. అందునా గుడివాడ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణాజిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోటాపోటీగా రంగా వర్దంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి వైసీపీ – టీడీపీ. రంగా వర్దంతి మీరెలా నిర్వహిస్తారంటూ రావి వెంకటేశ్వరరావుకి మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుల ఫోన్లు చేయడం కలకలం రేగింది. టీడీపీ ఆఫీసులోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. ఎట్టి పరిస్థితుల్లోనూ రంగా వర్దంతి జరిపి తీరతామంటోంది టీడీపీ. దీంతో గుడివాడలో టెన్షన్.. టెన్షన్ నెలకొంది. స్థానిక ఏజీకే స్కూల్ వద్ద రంగా వర్దంతి కార్యక్రమం నిర్వహించడానికి టీడీపీ ఏర్పాట్లు చేసింది.

Read Also:MK Stalin: నెహ్రూ వారసుడి మాటలు.. గాడ్సే వారసులను రెచ్చగొడుతున్నాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ కార్యాలయం నుంచి ఏజీకే స్కూల్ వద్దకు వెళ్లనున్నారు టీడీపీ నేతలు. శరత్ టాకీస్ వద్ద కొడాలి నాని నేతృత్వంలో రంగా వర్దంతి కార్యక్రమం నిర్వహించనున్న వైసీపీ. నిన్నటి గొడవతో అలెర్టైన పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వర్దంతి సభ మీరెలా నిర్వహిస్తారంటూ టీడీపీపై నిన్న దాడికి దిగారు వైసీపీ నేతలు. ఎలాంటి పరిణామాలు వచ్చినా రంగా వర్దంతి కార్యక్రమం నిర్వహించి తీరతామంటోంది టీడీపీ.దమ్ముంటే ఆపాలంటూ కొడాలికి రావి వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. దీంతో అక్కడేం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే…?

Show comments