Tension in Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట, బాహాబాహీ జరిగింది.. నియోజకవర్గ అభివృద్ధి, అవినీతిపై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతుండగా.. స్థానికంగా ఉన్న సత్యమ్మతల్లి దేవస్థానం వద్ద చర్చకు రావాలంటూఏ ఇద్దరు నేతలు సవాళ్లు విసిరుకున్నారు.. ఇక, సత్యమ్మ దేవాలయం వద్దకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేరుకోవడంతో.. పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు.. టీడీపీ కార్యాలయం నుంచి సత్యమ్మ దేవాలయం వద్దకు వచ్చారు మాజీ మంత్రి పల్లె.. దీంతో.. టెన్షన్ వాతావరణం నెలకొంది..
Read Also: Police: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు
ఓ దశలో.. టీడీపీ, వైసీపీ వర్గాలు బాహాబాహీకి దిగారు.. పరస్పరం చెప్పులు విసుకున్నాయి రెండు వర్గాలు.. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో 30 పోలీసు యాక్టు అమలు చేస్తున్నారు.. అయితే, పుట్టపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. నేతలతో పాటు.. పెద్ద ఎత్తున ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రావడంతో.. తోపులాట, దాడుల వరకు వెళ్లింది వ్యవహారం.. తోపులాటలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.. పల్లె వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.. మరోవైపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు మాజీ మంత్రి పల్లె.. వైసీపీ దౌర్జన్యాలు నశించాలంటూ నినాదాలు అచేశారు. అయితే, ఇరు వర్గాల తోపులాటలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.
మరోవైపు.. పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి.. 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు వైసీపీ శ్రేణులను దేవాలయం వద్దకు ఎలా అనుమతించారంటూ పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు.. వి వాంట్ జస్టిస్.. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి అంటూ నినాదాలు చేశారు.