NTV Telugu Site icon

Barytes Mines: మంగంపేటలో టెన్షన్ టెన్షన్.. బ్లాస్టింగ్ తో బాలుడు మృతి

Barytes Mines In Mangampet

Barytes Mines In Mangampet

Barytes Mines in Mangampet: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట అగ్రహారంలో దారుణం జరిగింది. నాలుగు సంవత్సరాల బాలుడు గోడ కూలడంతో మృతి చెందారు. ఏపీఎండిసి ప్రతిరోజు బ్లాస్టింగ్ చేయడంవలన ఇంటి పునాదులు కదిలాయి. బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ఉన్నట్లు ఉండి గోడ కూలడంతో అక్కడే ఆడుకుంటున్న ఈశ్వరయ్య అనే నాలుగు సంవత్సరాలు బాలుడు గోడకింద పడి మృతి చెందాడు. దీంతో అగ్రహారాన్ని A P M D C డేంజర్ జోనుగా ప్రకటించారు.

Read also: UK Economic Crisis: ఆర్థిక కష్టాల్లో బ్రిటన్.. 41ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం

మంగపేట బెరైటీస్ లో బ్లాస్టింగ్ వల్ల సమీపంలోని అగ్రహారంలో గోడ కూలి 4సంత్సరాల ఈశ్వర అనే బాలుడు మృతి చెందారు. బాలుడు మృతదేహంతో గ్రామస్థులు అంతా ఏపీఎండీసీ కార్యాలయంకు వెళ్లి కార్యాలయం ఎదుట బైఠాయించారు. బ్లాస్టింగ్ చేయడం వలనే బాలుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగంపేట బైరటిస్ లో చేసిన బ్లాస్టింగ్ వల్ల ఇంకెంత మంది ప్రాణాలు పోవాలంటూ ఆందోళన చేపట్టారు. సంవత్సరం నుండి తమని కాపాడమని పోరాటం చేస్తున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పిందింది బ్లాస్టింగ్ పనులు నిలిపివేయాలని కోరుతున్నారు. ఇంతకు మందు కూడా బ్లాస్టింగ్‌ తో చాలా మంది చనిపోయారని, ఇంటి గోడలు కదులుతున్నాయని వాపోతున్నారు. దీంతో ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాస్టింగ్‌ వలన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడుతున్నారు. అధికారులకు చెప్పిన పట్టించేకోవడం లేదని దానివల్లే ఇప్పడు తమ బాలున్ని కోల్పోయామని వాపోయారు. దీనికి తగిన పరిష్కారం తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు? బ్లాస్టింగ్‌ పనులను ఆపివేస్తారా? అనేది వేచి చూడాలి.
Strange Noises in Pedpadalli: పెద్దపల్లి జిల్లాలో రాత్రి వేళల్లో వింత శబ్దాలు..

Show comments