నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.. స్థానిక రాజకీయనాయకుని వాహనానికి సైడు ఇవ్వలేదని ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఏఎస్సై కొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.. ఇక, తన బావకోసం వెళ్లిన మహిళను కూడా కొట్టారని.. ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలుస్తోంది.. ఏఎస్సై మద్యం సేవించి కొట్టినట్లు బాధిత మహిళ వాపోయింది.. దీంతో, పెద్ద ఎత్తున పీఎస్ దగ్గరకు చేరుకున్న మహిళా బంధువులు.. స్టేషన్ ముందు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. దీంతో, మిడుతూరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, పీఎస్‌పై దాడికి యత్నించారని పోలీసులు చెబుతున్నారు.. 14 మందిపై కేసు నమోదు చేశారు..
Read Also: Covid 19: చైనాలో కరోనా విజృంభణ.. ప్రజలు ఇళ్లకే పరిమితం..!
నిన్న రాత్రి సుంకేసులలో కారుకు సైడ్ ఇవ్వలేదనే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగగా.. తన కారుకు ట్రాక్టర్ అడ్డం పెట్టడమేకాకుండా మముల్ని తిట్టడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు రాముడు అనే వ్యక్తి, ఆయన భార్య.. దీంతో, ట్రాక్టర్ డ్రైవర్‌ను డ్రంకన్ డ్రైవ్ మిషన్ పెట్టి విచారించారు పోలీసులు.. ట్రాక్టర్ డ్రైవర్ తాగి ఉన్నాడని.. మిషన్ 105 పాయింట్లు చూపించిందని చెబుతున్నారు.. ఇక, విచారిస్తుండగానే ట్రాక్టర్ డ్రైవర్ అతని బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారని.. పోలీస్ స్టేషన్ పై దాడికి యత్నించారని అభియోగాలు మోపుతూ.. 14 మందిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ.. మరి కొంతమందిని గుర్తించి కేసు నమోదు చేస్తామని వెల్లడించారు మిడుతూరు ఎస్ఐ..