Site icon NTV Telugu

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఒడిశా అధికారుల ఓవరాక్షన్

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒడిశా నుంచి ఎవరూ రాకుండా బోర్డర్ క్లోజ్ చేసేశారు ఏపీ పోలీసులు, అధికారులు. ఇచ్ఛాపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే మినహాయింపులు ఇస్తున్నారు అధికారులు. ఇది ఇలా ఉండగా.. ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో ఒడిశా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఆంధ్రా ప్రాంతం నుంచి రాకపోకలను అడ్డుకునేందుకు రోడ్డును బుల్డోజర్లతో తవ్వేశారు ఒడిశా అధికారులు. శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం నుంచి ఒడిశాలోకి ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఒడిశా గ్రామాలైన భిన్నాల, బడగాం , అగర్ఖండి గ్రామాల సరిహద్దు రహదారులను తవ్వేసారు ఒడిశా అధికారులు. అయితే ఒడిశా అధికారుల తీరుపై మండిపడుతున్నారు సరిహద్దు ఏపీ గ్రామ ప్రజలు.

Exit mobile version