తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాల్లోకి దర్శనాలకు నేటి నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత ఇవాళ ఉదయం నుంచి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. అన్నవరంలో నేటి నుంచి భక్తులకు సత్యదేవుని వ్రతములు, కల్యాణములు, తలనీలాల సమర్పణకు అవకాశం కల్పించారు. అయినవల్లి , అంతర్వేది, అప్పనపల్లి, కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయాలకు భక్తుల రాక తిరిగి ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.
అక్కడ నేటి నుంచి ఆలయాల్లోకి భక్తులకు అనుమతి…
