తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్తుంటారు. ఉన్నత చదువులు చదివి అక్కడే ఉద్యోం సంపాదించి డాలర్లు సంపాదించాలని కలలుకంటుంటారు. అయితే కొంతమంది విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోకుండానే అసువులు బాస్తున్నారు. వివిధ కారణాలతో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. దుండగుల కాల్పుల్లో కొందరు, రోడ్డు ప్రమాదాలు, వ్యక్తిగత కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ లో తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: Thandel Review: తండేల్ రివ్యూ
సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో అతని ఫ్రెండ్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం ఇంకా కుటుంబ సభ్యులకు తెలియదు. సాయికుమార్ ఫోన్ లాక్ చేసి ఉండడంతో అతని కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు అతని స్నేహితులు. మీడియా ద్వారానైనా అతని కుటుంబ సభ్యులకు తెలియజేయాలంటు NTV ని ఆశ్రయించిన సాయికుమార్ స్నేహితుడు. తన స్నేహితుడు చనిపోయిన విషయాన్ని NTV ద్వారానైనా అతని కుటుంబ సభ్యులకు తెలియజేయాలంటు విన్నపం.