Telugu States Students Got Good Rank In UPSC CSE 2022: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2022 తుది ఫలితాలు ఈరోజు వచ్చాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ సత్తా చాటారు. నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి మూడో ర్యాంకుతో మెరిసింది. అలాగే.. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకుతో సత్తా చాటారు. వీరితో పాటు శాఖమూరి శ్రీసాయి హర్షిత్ 40, సాయి ప్రణవ్ 60, ఆవుల సాయికృష్ణ 94,నిధి పాయ్ (హైదరాబాద్) 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157, కమతం మహేశ్‌కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, సాహిత్య (విశాఖపట్నం) 243, అంకుర్ కుమార్ 257, బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్.చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్ 362, సోనియా కటారియా 376, ఇప్పలపల్లి సుష్మిత (షాద్‌నగర్) 384, రేవయ్య 410, సీహెచ్ శ్రావణ్‌కుమార్ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462, రెడ్డి భార్గవ్ 772, నాగుల కృపాకర్ 866 ర్యాంకులు సాధించారు.
TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక మలుపు
2022 ఏడాదికి గాను యూపీఎస్‌సీ మొత్తం 933 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే.. ఐఏఎస్ సర్వీసులకు 180, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. అలాగే.. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ – ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు తేలింది. కాగా.. సివిల్ సర్వీసెస్ పరీక్షను గతేడాది జూన్ 5వ తేదీన నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 11,35,697 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 5,73,735 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 13,090 మంది అభ్యర్థులు సెప్టెంబర్ 2022లో జరిగిన రాత పరీక్షకు అర్హత సాధించారు. వారిలో 2,529 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌కు అర్హత సాధించగా.. ఆ అభ్యర్థుల్లో నుంచి మొత్తం 933 మందిని (613 మంది పురుషులు, 320 మంది మహిళలు) వివిధ సర్వీసులకు నియామకం కోసం యూపీఎస్సీ సిఫార్సు చేసింది. మరోవైపు.. తమ పిల్లలు సివిల్స్‌లో ఇలా సత్తా చాటడంతో, వారి కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Kishan Reddy: ప్రకృతితో మమేకమై జీవించడమే భారతీయ జీవన విధానం