NTV Telugu Site icon

Telugu Lady Inspirational Story: లక్ష్మీ ఆంటీ ఎంబీబీఎస్‌. ఇది రీల్‌ స్టోరీ కాదు. రియల్‌, ఇన్‌స్పిరేషనల్‌ స్టోరీ

Telugu Lady Inspirational Story2

Telugu Lady Inspirational Story2

Telugu Lady Inspirational Story: మనిషికో చరిత్ర. కానీ.. అందరివీ అంత ఆసక్తికరంగా ఉండవు. ఆదర్శంగా అసలే అనిపించవు. అయితే.. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన లక్ష్మి అనే మహిళది మాత్రం సూపర్‌ హిట్‌ సినిమాకు మించిన ఇంటస్ట్రింగ్‌ స్టోరీ. ఇన్‌స్పిరేషనల్‌ స్టోరీ. చదువు మానేసిన 30 ఏళ్ల తర్వాత 49 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్‌లో చేరి 53 ఏళ్ల వయసులో విజయవంతంగా కోర్సు పూర్తి చేశారు. అసలు ఆ వయసులో అంత కష్టమైన కోర్సులో చేరటం, భూదేవి అంతటి ఓపికతో, అసాధారణ ఆసక్తితో చదవటం, సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేయటం నిజంగా అద్భుతమేనని చెప్పొచ్చు.

మనం కలలో కూడా ఊహించని ఎన్నో మలుపులు ఈమె లైఫ్‌లో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ చిన్న వీడియో చూస్తే చాలు. విలువైన సందేశాన్ని, వెలకట్టలేని స్ఫూర్తిని సొంతం చేసుకుంటారు. నిజానికి ఈ వీడియో ఐదేళ్ల కిందట పబ్లిష్‌ అయింది. కానీ.. పట్టుదల ఉంటే కానిది లేదని నిరూపించటానికి, యువతకు గొప్పగా చెప్పుకోవటానికి ఇదొక ఎవ్వర్‌ గ్రీన్‌, ఎక్స్‌క్లూజివ్‌ న్యూస్‌ స్టోరీ. మనకంటూ ఒక సమయం వస్తుందని, జీవితంలో చివరి నిమిషం దాకా నమ్మకాన్ని కోల్పోకూడదని బోధించే పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ పాఠాల్లో దీన్నీ కళ్లుమూసుకొని చేర్చొచ్చు. తద్వారా ఎంతో మంది కళ్లు తెరిపించొచ్చు. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే చూసేద్దాం ఆ ప్రత్యేక కథనం.

Show comments