కేఆర్ఎంబీకి తెలంగాణ మరో లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. లేఖల పర్వం నడుస్తూనే ఉంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్.. 50 : 50 శాతంలో కృష్ణా నీటివాటా కేటాయించాలని కోరిన ఆయన.. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని బేసిన్ పరిధి దాటి మళ్లిస్తుందని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపునకు త్రిసభ్య కమిటీ ఆమోదం లేకుండా అనుమతించకూడదని పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి తెలంగాణకు అభ్యంతరం లేదన్న ఈఎన్సీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ చేసిన 811 టీఎంసీలు గంపగుత్త కేటాయింపులని తెలిపింది.. ఈ విషయాన్ని ధృవీకరించిన సుప్రీంకోర్టు.. రెండు రాష్ట్రాల మధ్య పునర్ కేటాయింపుల అంశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నందున 2021-22 వాటర్ ఇయర్ నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని కోరింది.
ఇక, బేసిన్ లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతనే బేసిన్ అవతలి ప్రాంతాలకు నీటిని తరలించడానికి అనుమతించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును కోరింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. కృష్ణాలో వరద ఉన్న కారణంగా అన్ని జల విద్యుత్ కేంద్రాల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో చేయడానికి అనుమతించాలని కేఆర్ఎంబీని విజ్ఞప్తి చేసింది.. కాగా, తెలంగాణ జల విద్యుత్‌పై ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రానికి, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో తెలంగాణ విజ్ఞప్తిపై కేఆర్ఎంబీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
తాజావార్తలు
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!