ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్‌యలకు కౌంటర్ ఇచ్చారు ఉపాధ్యాయ సంఘాల నేతలు.. నారాయణస్వామి వ్యాఖ్యలపై స్పందించిన ఫాప్టో ఛైర్మన్ సుధీర్ బాబు.. మా ఉపాధ్యాయుల పిల్లల్లో 50 శాతం పిల్లలు ప్రభుత్వ స్కూళ్లల్లోనే చదువుతున్నారు.. మరి మంత్రి నారాయణ స్వామి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు..? అంటూ నిలదీశారు.. మంత్రి నారాయణ స్వామి బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదని హితవుపలికిన ఆయన.. పీఆర్సీ సమస్యను పరిష్కరించలేక దాట వేసేందుకే మంత్రులు ఈ నాటకాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
Read Also: పీఆర్సీ సాధన సమితి సంచలన వ్యాఖ్యలు.. ఐఏఎస్‌లకు వార్నింగ్..!
మరోవైపు, మంత్రులు ఇప్పుడే ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు..? అని ప్రశ్నించారు ఫ్యాప్టో ప్రతినిధి
హృదయ్ రాజ్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పరిస్థితులున్నాయా..? అని నిలదీసిన ఆయన.. కార్పొరేట్స్కూ ళ్లు లేని వ్యవస్థను ఈ ప్రభుత్వం తీసుకురాగలదా..? అంటూ సవాల్ విసిరారు.. పీఆర్సీ గురించి మేం ఉద్యమిస్తోంటే మంత్రి నారాయణ స్వామి ఈ విధంగా మాట్లాడ్డం సరికాదని హితవుపలికారు హృదయ్ రాజ్.. కాగా, ఇవాళ ఉద్యోగుల సమ్మెపై స్పందించిన నారాయణస్వామి.. టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు నెలకు రూ. 70 వేలు, లక్షల జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని మండిపడ్డారు. టీచర్లు వారి పిల్లలను వారే పాఠాలు చెప్పే స్కూళ్లల్లో ఎందుకు చదివించడం లేదు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.