Site icon NTV Telugu

Telugu Desam Party: టీడీపీ ఆధ్వర్యంలో ‘ఛలో కంతేరు’.. మాజీ మంత్రి హౌస్ అరెస్ట్

Nakka Anand Babu

Nakka Anand Babu

ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో వెంకాయమ్మ కుటుంబంపై వైసీపీ నేతలు పలు మార్లు దాడి చేశారని ఆరోపిస్తూ టీడీపీ నిరసనలు చేపట్టింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. వెంకాయమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబంపై పదేపదే దాడులు జరుగుతుంటే అడ్డుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. బాధితురాలు వెంకాయమ్మతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చారు.

కాగా ఎస్సీ మహిళ కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఈరోఉ ఛలో కంతేరుకు పిలుపునిచ్చారు. ఈ మేరకు టీడీపీ నేతలు కంతేరు వెళ్లేందుకు ప్రయత్నించగా పలుచోట్ల పోలీసులు అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రకటించారు.

Exit mobile version