Site icon NTV Telugu

TDP Twitter Account Hacked: టీడీపీకి హ్యాకర్స్‌ షాక్..

సోషల్‌ మీడియా ఇప్పుడు ఎంతో మందికి చేరువైపోయింది.. పిల్లలు, యూత్‌, పెద్దలు అనే తేడా లేకుండా అంతా సోషల్‌ మీడియాలో అడుగు పెడుతున్నారు.. యాక్టివ్‌గా ఉంటున్నారు.. అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఇక, ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఇలా.. ఎంతో మంది తమ కార్యక్రమాలు, కార్యాచరణ అన్నీ షేర్‌ చేసుకుంటున్నారు.. ఇదే సమయంలో.. ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాకర్స్‌ బెడద వెంటాడుతూనే ఉంది.. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లే కాకుండా పార్టీల ఖాతాలు కూడా హ్యాక్ చేస్తున్నారు కేటు గాళ్లు..

Read Also: BJP: కడపలో బీజేపీ ‘రాయలసీమ రణభేరి’ సభ

తాజాగా, ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను కూడా హ్యాక్ చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఆ ఖాతాకు టీడీపీకి బదులు ఎలాన్‌ మస్క్‌ పేరు మార్చిన హ్యాకర్స్.. విచిత్రమైన ట్వీట్లు చేశారు. ఇక, టీడీపీ అధికార ట్విట్టర్ ఖాతా హ్యాక్‌ అయిన విషయాన్ని వెల్లడించారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందంటూ వెల్లడిస్తూ ఓ ట్వీట్ చేసిన లోకేష్‌.. ఆ ఖాతాను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు.

Exit mobile version