NTV Telugu Site icon

టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. సీఎం జగన్ హెరాయిన్ సప్లై చేస్తున్నారు..!

సీఎం వైఎస్‌ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు.. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన రద్దుపై స్పందించిన ఆయన.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే బెణకని వైఎస్‌ జగన్ కాలు.. ఢిల్లీ అంటే బెణికిందా..? అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యానించిన ఆయన.. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది..? కేంద్రాన్ని హోదా అడగకుండా తాడేపల్లిలో తల దాచుకున్నారు అంటూ మండిపడ్డారు. ఏ అంశం పైనైనా టీడీపీ గాలి మాటలు మాట్లాడదని.. సాక్ష్యాధారాలతో మాట్లాడుతుందని డీజీపా గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించిన ఆయన.. ఏపీలో డ్రగ్స్ మాఫియా నడుస్తుంది.. ఏపీలో పోలీసు శాఖ ఎవరి కోసం పని చేస్తుంది..? టీడీపీని మాట్లాడద్దని చెప్పడానికి డీజీపీ ఎవరు..? అంటూ నిలదీశారు.. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌.. యువతకు హెరాయిన్ సప్లై చేస్తున్నారని ఆరోపించిన రామ్మోహన్‌నాయుడు.. డీజీపీ, ఎస్పీలు, కమిషనర్లు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుంది. అని ప్రశ్నించారు. హేరాయిన్ అంశంలో వే బిల్లులు బయటకి తీయాలని డిమాండ్ చేశారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు.