Kesineni Nani: టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవ చేయాలంటే నేనే సామంతరాజును అని ఫీల్ కాకూడదని సూచించారు. తానే ఆరుసార్లు ఎమ్మెల్యే అవ్వాలి.. తానే 8 సార్లు మంత్రి అవ్వాలంటే కుదరదన్నారు. ప్రజలు మెచ్చేలా పాలన చేయాలని కేశినేని నాని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసలు ఏ పార్టీలో ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తానే రాజునని ఫీల్ అయితే ప్రజలు కృష్ణానదిలోకి ఈడ్చి కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు
రాజకీయాల్లో నువ్వు లవ్ చేయి.. నేను నిన్ను లవ్ చేయను అంటే కుదరదు అని.. యూ లవ్ మీ.. ఐ లవ్‌యూ అనేలా ఉండాలని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఒకవేళ యూ హేట్ మీ అంటే ఐ హేట్ యూ అని చెప్పాలన్నారు. ఏపీలో జగన్‌ను ఎదుర్కోవాలంటే అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇది నాది.. అది నీది అంటూ పని చేస్తే వర్కవుట్ కాదని పేర్కొన్నారు. తాను ఎంపీనని.. రెండు కొమ్ములున్నాయని అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఉరికించి కొడతారని .. ఇది రాచరిక వ్యవస్థ కాదని.. ప్రజాస్వామ్యం అని గుర్తుంచుకోవాలన్నారు. అటు ఎన్నికల్లో గెలిచేవారికే సీట్లు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. తాను విజయవాడ ఎంపీగా వైసీపీ ఎమ్మెల్యే సభకు కూడా వెళ్తానని.. వైసీపీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడు కాబట్టే మైలవరానికి ఎంపీ ఫండ్స్ కేటాయించనని కేశినేని నాని వివరించారు.