NTV Telugu Site icon

Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు..

Raghu

Raghu

Raghu Rama Krishna Raju: ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు మంగళవారం నాడు ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్‌ పదవికి బుధ, గురువారాల్లో నోటిఫికేషన్‌ రిలీజ్ కానుంది. ఈ పదవికి రఘురామకృష్ణరాజు ఎన్నిక లాంఛనమే అని చెప్పాలి. అయితే, మంగళవారం జరిగిన ఎన్డీఏ లెజిస్లేటివ్‌ సమావేశంలో కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి డిప్యూటీ స్పీకర్‌తో పాటు ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్‌ల నియామకంపై ప్రధానంగా చర్చ జరిపారు. దీంతో అసెంబ్లీ, మండలికి చీఫ్ విప్‌ల నియామకాలు, డిప్యూటీ స్పీకర్‌ పేరును కూడా సర్కార్ అందించింది. అసెంబ్లీలో 11 మంది టీడీపీ, ముగ్గురు జనసేన, ఒకరు బీజేపీ నుంచి చీఫ్ విప్‌లను నియమించింది. మండలిలో ఇద్దరు టీడీపీ, ఒకరు జనసేన నుంచి విప్‌గా ఎంపికయ్యారు.

Read Also: Mystery Solved : వీడిన మడకశిర గుర్తు తెలియని శవం మిస్టరీ..!

ఇక, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్డీయే కూటమి తరఫున నన్ను నామినేట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తో పాటు బీజేపీకి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. కాగా, 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ సర్కార్ పై తిరుగుబాటు చేశారు. అప్పటి సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.