Site icon NTV Telugu

Yanamala Ramakrishnudu: బీసీల పేరెత్తే అర్హత జగన్ కి ఎక్కడిది?

Yanamala Ramakrishnudu

Yanamala Ramakrishnudu

ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. బీసీల పేరెత్తే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు. 56 కార్పొరేషన్లు పెట్టి, పైసా ఖర్చు చేయని దుర్మార్గ చరిత్ర జగన్ రెడ్డిదే. రాష్ట్రంలోని బీసీలంతా జగన్ పాలనలో మాకు ‘‘ఇదేం ఖర్మ’’ అంటున్నారు.టీడీపీ స్లోగన్ అయిన ‘జయహో బీసీ’ కాపీ కొట్టడం సిగ్గుచేటు. బీసీలకు టీడీపీ అమలు చేసిన పథకాలు రద్దు చేసి బీసీ సభ ఏర్పాటా..?బీసీలకు రాజకీయంగా అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం మాత్రమే అని స్పష్టం చేశారు యనమల.

Read Also: Pawan Kalyan: సుజిత్ దర్శకత్వంలో పవన్.. డీవీవీ నుంచి ప్రకటన వచ్చేసింది

నిధులు విధులు, అధికారాలు సొంత వారికి.. పదవులు మాత్రం బీసీలకా? సబ్ ప్లాన్ నిధులు మళ్లించడం బీసీలను వంచించడం కాదా? టీడీపీ జయహో బీసీ అంటూ పదవులిస్తే.. జగన్ రెడ్డి నైనై బీసీ అంటూ తొక్కిపెట్టాడు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కోత బీసీల ఉద్దారణా..? రాష్ట్రాన్ని రెడ్లకు ధారబోసి బీసీలను అణగదొక్కడం నిజం కాదా..? అని యనమల ప్రశ్నించారు. వెయ్యికి పైగా ఉన్న నామినేటెడ్ పదవుల్లో బీసీలెంతమంది? అని ఆయన అన్నారు. 12 యూనివర్శిటీల్లో బీసీ వీసీలు ఎంత మంది..? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మండలి ప్రతిపక్ష నేత, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు బీసీలే. మరి వైసీపీ సంగతి ఏంటన్నారు. వైసీపీలో ఆయా పదవుల్లో ఉన్నదెవరు జగన్ రెడ్డీ? జయహో బీసీ పేరుతో సభ పెట్టి ఏం చెప్పబోతున్నారు? బీసీ అయిన జింకా వెంకట నరసయ్యను జగన్ తాత రాజారెడ్డి ఎలా చంపాడో చెప్తారా? జగన్ పాలనలో 26 మంది బీసీ నేతల హత్యల గురించి చెబుతారా? అని ఆయన ఎద్దేవా చేశారు.

Read Also:Stunt Master Suresh: సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. స్టంట్ మాస్టర్ మృతి

Exit mobile version