NTV Telugu Site icon

వినోద్ జైన్ కూతురు వయసు అని కూడా చూడకుండా వేధించాడు : చిన్నారి తాత

చిన్నారిని టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ఏపీలో దుమారం రేపుతోంది. ఈ సందర్బంగా ఆ చిన్నారి తాత మాణిక్యాలరావు మాట్లాడుతూ నా మనుమరాలిని నాలుగు నెలల వయసు నుంచీ పెంచాను. 2008 ఏప్రిల్ లో పుట్టింది. నిన్న మధ్యాహ్నం నుంచీ నా మనుమరాలు ముభావంగా ఉంది. నిన్న సాయంత్రం వాకింగ్ కి బయలుదేరినపుడు పలకరించింది. ఎప్పుడూ లేనిది కొత్తగా వాళ్ళ అమ్మను ఐ లవ్ యూ మమ్మీ అంటూ కౌగిలించుకుందని ఆయన తెలిపారు. ఎవరో పాప సూసైడ్ చేసుకుందని చెబితే వెళ్లి చూశాం. అక్కడ నా మనవరాలు నిర్జీవంగా పడి ఉంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మా మనవరాలు బెడ్ రూమ్ లో, బుక్ లో సూసైడ్ నోట్ ఉంది. వినోద్ జైన్ నా మనవరాలిని ఎవరికీ చెప్పలేని విధంగా లైంగికంగా వేధించినట్లు సూసైడ్ నోట్లో రాసింది. నా మనవరాలు మరణానికి కారణమైన వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలి. మల్టీ టేలెంటెడ్ నా మనుమరాలు. వినోద్ జైన్ ఒక ఫ్లాట్ లో ఉంటాడనే తెలుసు. వినోద్ జైన్ కూతురు వయసు అని కూడా చూడకుండా వేధించాడు. సీఎం‌ జగన్ స్పందించి దేవాదాయ శాఖామంత్రిని పంపించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.