Site icon NTV Telugu

Mandra Sivananda Reddy: లోకేష్‌ను కలవడానికి బైరెడ్డి ఎంతో మంది కాళ్లు పట్టుకున్నారు

Mandra Sivanand Reddy

Mandra Sivanand Reddy

వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డిపై నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి మాండ్ర శివానందరెడ్డి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నందికొట్కూరు నియెజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలని వైసీపీ నాయకులు చెప్పాలని మాండ్ర శివానందరెడ్డి డిమాండ్ చేశారు. రియల్టర్ల దగ్గర కమిషన్లు తీసుకోవడం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నందికొట్కూరులో వైసీపీ రాక్షస పాలన సాగుతోందని.. డాక్టర్‌పై దాడి ఘటనే అందుకు ఉదాహరణ అని మాండ్ర శివానందరెడ్డి విమర్శలు చేశారు.

టీడీపీలో చేరాలని ఎవరెవరి కాళ్లు పట్టుకుని నారా లోకేష్‌ను కలిశారో అందరికీ తెలుసు అని మాండ్ర శివానందరెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్‌ను గెలిపించింది పార్టీ కానీ వ్యక్తి కాదన్నారు. వైసీపీ ఇంఛార్జ్ వాపు చూసుకుని బలుపు అనుకుంటున్నారని.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి సొంత పార్టీ పెట్టి విఫలమైన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కాగా ఇటీవల తాను టీడీపీ చేరతానని వస్తున్న వార్తలను బైరెడ్డి సిద్ధార్ధ్‌రెడ్డి ఖండించిన సంగతి తెలిసిందే. నందికొట్కూరు అభివృద్ధి కోసం రూ.16 కోట్లు మంజూరు చేయించానని.. తాను నారా లోకేష్‌ను కలిసినట్లు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు ఆధారాలు చూపించాలని బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి సవాల్ విసిరిన సంగతి విదితమే.

Tirupati: రుయా ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఆర్ఎంవోపై వేటు

Exit mobile version