Site icon NTV Telugu

Kala VenkatRao: ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డితో డేంజర్

Kala Vs Venkat

Kala Vs Venkat

ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డి ప్రజాస్వామానికే అతి పెద్ద ప్రమాదకరం అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు. సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వెంకటరామిరెడ్డి న్యాయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అన్నారు. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్లేలా మాట్లాడటం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. వెంకటరామిరెడ్డి ఉద్యోగ సంఘ నాయకుడులా కాకుండా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలా మాట్లాడుతున్నారు. వెంకటరామిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇతర ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడితే వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?

రాష్ట్రంలో లాలెస్ నెస్ కు దారి తీస్తుంది. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడకపోగా స్వప్రయోజనాల కోసం వెంకటరామిరెడ్డి ప్రాకులాడుతున్నారు. వెంకటరామిరెడ్డిపై చీఫ్ సెక్రటరీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కళా వెంకట్రావ్ డిమాండ్ చేశారు. లేనట్లైతే దీనిపై ప్రైవేట్ కేసులు వేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేంలో ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని..దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఉద్యోగి పైనా ఉందన్నారు. అదే సందర్భంలో న్యాయవ్యవస్థలో ఉండే లోపాలపైనా మనం చర్చించుకోవాలని అభిప్రాయపడ్డారు. కొన్ని రాజ్యాంగ సంస్థలు ప్రభుత్వాన్ని నియంత్రించే పరిస్థితులు చూస్తు న్నామని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఓ మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రిని తిడితే మాత్రం గంటలో బెయిల్ వచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. జడ్జిలకే ఆత్మాభిమానం ఉంటుందా.. ముఖ్యమంత్రులకు ఉండదా..అంటూ నిలదీసారు. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని అడ్డుకుని.. ప్రజల్లో సానుకూలత పెరిగేలా చూడాలని కోరారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Ap Employees union, ap govt, Judges, Lawless ness, tdp vs ysrcp, Kala Venkatrao, Controversial comments

Exit mobile version