Site icon NTV Telugu

బ్రేకింగ్: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు.

Read Also: ఉద్యోగులకు ట్విస్ట్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం… హెచ్‌ఆర్‌ఏలో కోత

కాగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు కూడా సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి కరోనా రావడంతో తనలోనూ తేలికపాటి లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి చంద్రబాబు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండటంతో ఈరోజు ఏపీ వ్యాప్తంగా జరిగే ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో ఈరోజు నుంచే నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేయనున్న సంగతి విదితమే.

Exit mobile version