NTV Telugu Site icon

Buddha Venkanna: మంత్రి అమర్నాథ్ ఆస్తులపై విచారణ జరగాలి

Venkanna Buddha

Venkanna Buddha

ఏపీలో మంత్రి గుడివాడ అమర్నాథ్, టీడీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉత్తరాంధ్ర టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న మంత్రి అమర్నాథ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిన నీ ఆస్తులు ఎంత ఇప్పుడు ఉన్న నీ ఆస్తులు ఎంత? గుడివాడ అమర్నాథ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యే. నువ్వు ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతావు.. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?మంత్రి అమర్నాథ్ కు దమ్ముంటే మా సవాల్ స్వీకరించాలి అన్నారు బుద్దా వెంకన్న.

Read Also: Ganjai in Andhra University: ఏయూలో గంజాయి కలకలం.. నలుగురి అరెస్ట్

రాయలసీమ తరహాలో ఇక్కడ వ్యాపారస్తుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నావు. విస్సన్నపేటలో 600 ఎకరాలు భూ కబ్జాలో విజయసాయి రెడ్డికి వాటా ఇచ్చావు కాబట్టి, నీకు మంత్రి పదవి ఇచ్చారు. గుడ్డు కోడి అవడానికి సమయం పడుతుంది అన్నావు. గుడ్లు మీరే తినేస్తే ఇక కోడి ఎలా అవుతుంది? కాపు సామాజిక వర్గం పేరుతో గెలిచిన నీవు సిగ్గు లేకుండా కాపులను తిడుతున్నావు. మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్యకి లేఖ రాయడం కాదు, పార్టీ కోసం కష్టపడ్డ షర్మిలకు మంత్రి పదవి ఇవ్వమని మీ ముఖ్యమంత్రికి లేఖ రాయాలన్నారు బుద్దా వెంకన్న.

Read Also: Satya Kumar: రెండుపార్టీలు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు

Show comments