Site icon NTV Telugu

Bonda Uma: వాసిరెడ్డి పద్మ మమ్మల్ని ఒరేయ్ అంటే.. మేం ఒసేయ్ అనలేమా?

Bonda Uma

Bonda Uma

ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని బోండా ఉమ ప్రశ్నించారు. తాము బాధితురాలిని కలవడానికి వెళ్తున్నామని తెలిసే.. వాసిరెడ్డి పద్మ అక్కడికి చేరుకుని ఓవరాక్షన్ చేశారని మండిపడ్డారు. ఘటన జరిగిన మూడు రోజుల ఆమె బాధితురాలిని కలిసి రాజకీయానికి తెరతీశారని ఆరోపించారు. బాధితురాలి కుటుంబాన్ని రోడ్డుకు లాగిందే వాసిరెడ్డి పద్మ అని తీవ్ర విమర్శలు చేశారు. ఈనెల 27లోగా బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులకు తాము స్పందించిందే లేదని బోండా ఉమ స్పష్టం చేశారు. ఈ అంశంపై తాము న్యాయ పోరాటానికి సిద్ధమని తెలిపారు. వాసిరెడ్డి పద్మ మమ్మల్ని ఓరేయ్ అంటే.. తాము ఆమెను ఒసేయ్ అనలేమా అని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే ఆమె తమకు నోటీసులు ఇచ్చారని.. వాసిరెడ్డి పద్మను పదవి నుంచి తొలగించేవరకు తాము న్యాయపోరాటం చేస్తామని బోండా ఉమ తెలిపారు. తాము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తే.. జగన్ సర్కారు బాధితురాలి శీలాన్ని రూ.10 లక్షలకు వెలకట్టి చేతులు దులుపుకుందని బోండా ఉమ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Vijayawada: లాడ్జీలో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. సకాలంలో స్పందించిన పోలీసులు

Exit mobile version