NTV Telugu Site icon

Ayyannapatrudu: ఏడుకొండలపై అయ్యన్న వింతకోరిక…. ఏం కోరాడో తెలిస్తే షాక్!

Ayyanna 1

Ayyanna 1

చింతకాయల అయ్యన్నపాత్రుడు… ఏపీలో ఉత్తరాంధ్రకు చెందిన ఈ నేత టీడీపీలో కీలకం. ఆయనేం మాట్లాడినా సంచలనమే..ఆయన తనమీద అధికార పార్టీ కేసుల మీద కేసులు పెడుతోందని, ఉక్కిరి బిక్కిరి చేస్తోందని మండిపడుతున్నారు. తాజాగా అయ్యన్నపాత్రుడు తిరుమల వెంకన్న దర్శనం నుంచి బయటికి వచ్చారు. వస్తూనే మీడియాను చూసి ఉత్సాహంగా మాట్లాడారు. ఏంటో అంత ఉత్సాహంగా ఉన్నారని మీడియా మిత్రులు అడిగితే ఆయన అసలు విషయం చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని దుర్మార్గుల‌ పరిపాలన నుంచి కాపాడవయ్యా ఏడుకొండలవాడా అని కోరుకున్నారు అయ్యన్న. అంతేకాదండోయ్ ఆయన రెండో కోరిక తెలిస్తే మాత్రం షాకవ్వక మానరు.

Read Also: MP VIjaya Sai Reddy: లోకేష్‌పై సెటైర్లు.. అక్కడ ఫోన్‌ను తలకిందులు చేయాల్సిన అవసరం ఏంటి?

రెండో కోరిక మాత్రం వైసీపీ నేత, ఎంపీ విజయ సాయి ఫోన్ దొరకాలని కోరుకున్నారట. ఎందుకంటే ఆయన ఫోన్ దొరికితే అసలు కథ అప్పుడు ప్రారంభం అవుతుందట. అసలు సంగతి యేటంటే ఈ ఇద్దరి మధ్య నిత్యం మాటల యుద్ధం సాగుతూనే వుంటుంది. విజయసాయి నిప్పు అయితే అయ్యన్న ఉప్పు.. ఇద్దరూ ఎప్పుడూ చిటపటలాడుతుంటారు. అయ్యన్న మీద గంజాయి రవాణా.. భూ ఆక్రమణ.. సారాయి అంటూ నిత్యం విజయసాయిరెడ్డి విరుచుకుపడుతుంటారు. అదే తరుణంలో అయ్యన్న కూడా ఏమాత్రం తగ్గకుండా ఏ-2 అని సంభోదిస్తూ ప్రెస్ మీట్లు..ప్రకటనలు కామెంట్లు చేస్తుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆమధ్య అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడం.. కోర్టులో బెయిల్ రావడం.. ఈ వ్యవహారాన్ని సైతం విజయసాయి తనదైన బాణీలో సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అయ్యన్న కూడా ఏమీ తగ్గలేదు. తమలపాకుతో నీవొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కాములో విజయసాయి రెడ్డి బంధువులకు పాత్ర ఉందని వార్తలు రావడం.. .అనుకున్నట్లుగానే ఆయన సంబంధికులు కొందరి మీద ఈడీ దాడులు చేయడం.. కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది.. దీంతో ఇందులో విజయసాయికి సైతం పాత్ర ఉందని అయ్యన్నపాత్రుడు అంటున్నారు. ఈనెల 21న విజయ సాయిరెడ్డికి చెందిన ఐఫోన్ ఒకటి ఎక్కడో పోయిందంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన ఫోన్ దొరకాలి గోవిందా.. ఈడీ దాడులు చేయాలి గోవిందా అంటూ అయ్యన్న కోరుకున్నాట్ట. మరి అయ్యన్న కోరికను ఆ మలయప్పస్వామి తీరుస్తాడా?

Read Also: Vijay-Rashmika: విజయ్, రష్మిక పెళ్లి చేసుకున్నారా.. వెడ్డింగ్ ఫోటో వైరల్