కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలకు ఇప్పటికే దూరంగా ఉండనున్నట్లు చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నామని, ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని కోరుతున్నట్టు పవన్ పేర్కొన్నారు. అయితే బద్వేలు ఉప ఎన్నికకు దూరం ఉండనున్నట్లు టీడీపీ కూడా తాజాగా ప్రకటించింది. ఈరోజు పొలిట్ బ్యూరోలో ఈ నిర్ణయం తీసుకుంది టీడీపీ. సంప్రదాయాలను గౌరవించాలని మెజార్టీ సభ్యుల అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఏకగ్రీవానికి సహకరించాలన్నారు చంద్రబాబు. అధికారిక ప్రకటనకంటే ముందు అభ్యర్థి రాజశేఖర్, బద్వేలు టీడీపీ నేత విజయమ్మతో ఈ విషయం చెప్పాలని చంద్రబాబు అన్నారు. కానీ బీజేపీ మాత్రం తాము ఈ ఎన్నికలో నిలబడుతాం అని ప్రకటించింది.
బద్వేలు ఉప ఎన్నికకు టీడీపీ దూరం…
