NTV Telugu Site icon

కేసీఆర్ కామెంట్లకు సిగ్గుపడాలి.. మాజీ ఎంపీ కొనకళ్ళ

తెలంగాణ విద్యుత్ రంగంలో దూసుకుపోతుంటే, ఏపీ చీకట్లో మగ్గుతోందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం సిగ్గుపడాలన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. 2014-19లో చంద్రబాబు ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిస్తే, ఈ సీఎం అంతా అంధకారం చేశారని మండిపడ్డారు. విద్యుత్ లేనందున రాష్ట్రానికి పరిశ్రమలు కూడా రావడంలేదు. ఏపీలో భూముల విలువ పడిపోయిందని, కరెంట్ కోతలు ఉన్నాయని కేసీఆర్ హేళన చేస్తుంటే, జగన్ ఎందుకు స్పందించరు..?

కేసీఆర్‌కు శాలువాలు కప్పితే, ఏపీ అభివృద్ధి చెందదని ముఖ్యమంత్రి గ్రహించాలి. కేసీఆర్ తన రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే, జగన్ అప్పులు తెచ్చి, రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు. రూ.5 లక్షల కోట్ల వరకు అప్పులు చేసిన సీఎం.. ఈ 29నెలల కాలంలో ఏం చేశారంటే సమాధానం లేదు. ఆఖరికి చంద్రబాబు నిర్మించిన సచివాలయం, అసెంబ్లీల్లో ఉండే పాలన చేస్తున్నారు. వల్లభనేని వంశీ తన నియోజకవర్గాన్ని చంద్రబాబు, లోకేష్‌లే అభివృద్ధి చేశారని గతంలో గొప్పగా చెప్పుకున్నాడు. వైసీపీలోకి వెళ్లాక తన నియోజకవర్గానికి వంశీ ఏం సాధించాడు? ఎవరి కళ్లల్లోనో ఆనందం చూడాలనే వంశీ ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు.