NTV Telugu Site icon

వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీడీపికి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి.. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోయారు.. తాజాగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తూ.. గ‌త ఏడాదిలోనే టీడీపీకి రాజీనామా చేశారు శోభా హైమావతి.. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని ఆగ్రహం వెళ్ల‌గ‌క్కిన సంగ‌తి తెలిసిందే కాగా.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు హైమావ‌తి.

Read Also: శుభ‌వార్త: బ‌హిరంగ మార్కెట్‌లోకి కోవిషీల్డ్, కోవాగ్జిన్.. డీసీజీఐ అనుమ‌తి

ఈ సంద‌ర్భంగా శోభా హైమావ‌తి మాట్లాడుతూ.. అన్నింట్లో మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వటం అభినందనీయం అంటూ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించాఉ.. వైఎస్ జగన్ మహిళా పక్షపాతిగా అభివ‌ర్ణించిన ఆమె.. మహిళలను ఆర్ధికంగా, రాజకీయంగా అభివృద్ధి చేస్తున్న కృషి చూసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న‌ట్టు తెలిపారు.. ఇక‌, సీఎం వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేయటానికి క్షేత్ర స్థాయిలో కృషి చేస్తాన‌ని వెల్ల‌డించారు.. మ‌రోవైపు.. తాను మొదటి సారి సీఎంను కలిశాను.. చాలా ఆప్యాయంగా, అభిమానంగా మాట్లాడార‌ని తెలిపారు శోభా హైమావ‌తి.