డీజీపీకి చంద్రబాబు లేఖ.. అతడికి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు మరో లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం, తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి మరియ దాస్ అలియాస్ చిన్నాను అధికార వైసీపీకి చెందినవారి నుంచి, గూండాల నుంచి తీవ్ర ప్రాణహాని ఉందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లిరు.. పులి మరియ దాస్ టీడీపీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. దీంతో, వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఆయనపై పగ పెంచుకున్నారని.. తన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో మరియ దాస్‌ను నందిగాం సురేష్ టార్గెట్ చేశారని పేర్కొన్నారు.. ఎంపీ నందిగాం సురేష్ ఆదేశాలతో మరియ దాస్ పై దాదాపు 30 కేసులు పెట్టారు.. ఈ వేధింపులకు పరాకాష్టగా, 18 సెప్టెంబర్ 2021న, ఉద్దండరాయునిపాలెం గ్రామం మధ్యలో మరియ దాస్‌పై సురేష్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్టు..! హరీష్‌రావు కౌంటర్ ఎటాక్
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
నందిగాం సురేష్ అనుచరులు మరియ దాస్‌ను చంపాలనే ఉద్దేశ్యంతో ప్రతిరోజూ అతని కదలికలను అనుసరిస్తూ ఆయన ఇంటిపై రాత్రి సమయంలో నిఘా ఉంచారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు మరియ దాస్ కుటుంబ సభ్యులను, బంధువులను చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.. మరియ దాస్‌కు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం, ఎంపీ నందిగాం సురేష్ బాధ్యత వహించాలని.. మరియ దాస్‌పై జరిగిన వేధింపులు, దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, దాస్‌కు ఎలాంటి హాని జరగకుండా చూసేందుకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని.. ఈ విషయంలో పోలీసుల సత్వర చర్యలు మాత్రమే దాస్ ప్రాణాలను రక్షిస్తాయని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
- Tags
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!