Site icon NTV Telugu

అప్పులతో ఏపీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు: చంద్రబాబు


అప్పులతో ఏపీ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రాష్ర్టంలో జగన్‌ చేసిన అప్పులతో దివాళ తీసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా అప్పులు చేయకుండా పరిపాలన చేయాలని జగన్‌కు సూచించారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగంపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.

వరి వేయోద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ పార్టీలో నాయకులకు వ్యక్తిగత దూషణలు చేయడం మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై పాలన పై ఉండదని ఆయన ఆరోపించారు. గౌరవ అసెంబ్లీని కౌరవ సభగా మార్చిన ఘనత జగన్‌దేనన్నారు. చట్ట వ్యతిరేక నిధుల బదీలీని తక్షణమే విరమించుకోవాలన్నారు. జగన్ అనుసరిస్తున్న విధానాలతో రాష్ర్ట ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని చంద్రబాబు అన్నారు. త్వరలోనే ప్రజలు జగన్‌కు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చంద్రబాబు అన్నారు.

Exit mobile version