బడ్జెట్ సమావేశాలకు సిద్ధం అవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈనెల 20వ తేదీన ఒకేరోజు సభ నిర్వహించనున్నారు. అయితే, ఒకేరోజు సమావేశాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చారు.. ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలపై పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అయితే, మెజార్టీ నేతలు సమావేశాలను బహిష్కరించడమే మంచిదని పార్టీ చీఫ్‌కు తెలియజేశారు.. కోవిడ్‌తో సహా అనేక సమస్యలతో రాష్ట్ర ప్రజలు సతమతమవుతున్నారని.. కేసులు, ఇతర విషయాలపై చర్చించాల్సి ఉందని.. ఇలాంటి సమయంలో ఒక్క రోజు మాత్రమే సభ నిర్వహించడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. దీంతో.. ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చారు.
అయితే, కోవిడ్ నేపథ్యంలో ఒకేరోజు సభ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.. ఈనెల 20వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ ప్రసంగం ఉండనుండగా.. ఆ తర్వాత 2021-22 బడ్జెట్‌కు ప్రభుత్వం ఈ సమావేశంలోనే ప్రవేశపెట్టనుంది.. కానీ, తమ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు. చాలా సమస్యలు ఉన్నాయి.. వాటిపై చర్చ జరగకుండా.. ఒకే రోజు సభ నిర్వహించి.. తనను పొగిడించుకోవాలని సీఎం వైఎస్ జగన్ చూస్తున్నారని ఆరోపించారు యనమనల.