నిన్న( శుక్రవారం ) చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, దాడులు.. యుద్ధవాతావరణాన్ని తలపించాయి. పోలీస్ వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టడమే కాకుండా.. వారిపై దాడులకు కూడా దిగారు. ఆందోళనకారుల దాడుల్లో కొందరు పోలీసులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. పుంగనూరు ఘటనపై ఆమె గుప్పించారు.
Read Also: Honor Watch 4: అదిరిపోయే ఫీచర్స్ తో హానర్ స్మార్ట్ వాచ్.. ధర ఎంతంటే?
పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులపై దాడి చేయడం అమానుష చర్య అని ఆమె తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు అని హోంమంత్రి పేర్కొన్నారు. పుంగనూర్ ఘటనలో 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ఆమె వెల్లడించారు.
Read Also: Saba Karim: ధోనీ వచ్చాకే వికెట్ కీపర్లకు క్రేజ్ పెరిగింది
పుంగనూర్ లో జరిగిన ఘర్షణలో 40 మంది నిందితులను అదుపులోకి తీసుకొన్నామని హోంమంత్రి తానేటి వనితి వెల్లడించారు. ప్రజల్లో సానుభూతి పొందాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు ప్రసంగాలు చేయడం మానుకోవాలి అని సూచించారు. ఇదేనా చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ హోంమంత్రి ప్రశ్నించారు. ఈ ఘటనలో చంద్రబాబును ఏ1 నిందితుడిగా చేర్చాలని పోలీసులకు హోంమంత్రి తానేటి వనిత తెలియజేశారు. నిందితులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.