Site icon NTV Telugu

నూతన జిల్లాల ఏర్పాటు శుభ పరిణామం: తమ్మినేని సీతారాం

ఆంధ్రప్రదేశ్‌లో నూతన జిల్లాల ఏర్పాటు శుభ పరిణామమని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాల వికేంద్రీకరణ వలన ప్రజలకు మరింత మేలు కలుగుతుందన్నారు. చారిత్రక నేపథ్యం.. ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకోనే ప్రభుత్వం కొత్త జిల్లాలకు నామకరణం చేయడం అభినందనీయమన్నారు.మన దేశం అనేక అంతర్గత, బహిర్గత సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు.

Read Also: నా ప్రసంగాలు యువత, సమాజంలో మార్పు తీసుకువస్తే చాలు: గరికపాటి నరసింహారావు

దేశంలో మూడో వేవ్ క‌రోనా భారీగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. సీఎం జగన్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. వైసీపీ ప్రజల ఆంకాంక్షలను నేరవేర్చే ప్రభుత్వమని తమ్మినేని అన్నారు. కొత్త జిల్లాలతో రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయని తమ్మినేని పేర్కొన్నారు. కొత్త జిల్లాల కారణంగా ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా అందుతాయని తెలిపారు.

Exit mobile version