NTV Telugu Site icon

Jethwani Case: నటి జత్వానీ కేసులో ఆ ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ పొడిగింపు..

Jathwani

Jathwani

Jethwani Case: ముంబై నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతి రానా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెన్షన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.

Read Also: Starlink: స్పేస్ ఎక్స్‌తో ఎయిర్‌టెల్, జియో జట్టు.. భారతీయులకు ఏం లాభం..? ఇంటర్నెట్ ధరలు ఎంత..?

అయితే, 2025 సెప్టెంబర్ 25 వరకూ వారి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రివ్యూ కమిటీ సిఫార్సుల అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ అధికారులు ముగ్గురు అఖిల భారత సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించారని వారిపై అభియోగాలు ఉన్నాయి.