ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే కాదు.. మండలిలోనూ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. మద్యం ఎపిసోడుపై వరుసగా ఎనిమిదో రోజూ టీడీపీ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేశారు.. మద్య నిషేధంపై మహిళలకు జగన్ ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ ఎమ్మెల్సీల నినాదాలు చేశారు.. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ శాసన మండలి వరకు నిరసనగా ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్సీలు.. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ. 25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. దీంతో.. మండలిలో వరుసగా రెండో రోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తప్పలేదు..
Read Also: SriLankan Crisis: ఆర్థిక సంక్షోభం తీవ్రం.. దుర్భర పరిస్థితులు..
మండలిలో టీడీపీ సభ్యుల రచ్చ చేశారు.. విజిల్స్ వేస్తూ, చిడతలు వాయిస్తూ ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండలి ఛైర్మన్.. టీడీపీ సభ్యులు ఈ స్థాయిలో దిగజారిపోయారని అస్సలు ఊహించలేదన్నారు.. ఇక, బిచ్చగాళ్ళలా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్ఆరు.. సస్పెన్షన్ వేటు వేయాలని ప్రతిపాదించారు.. మంత్రి కన్నబాబు ప్రతిపాదనను మంత్రి సిదిరి సమర్థించారు.. విచ్చలవిడిగా, సిగ్గుమాలిన విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రెండోరోజు 8 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు మండలి చైర్మన్… టీడీపీ సభ్యులు బచ్చుల అర్జునుడు, కేఈ ప్రభాకర్, మర్రెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి, అంగర రామ్మోహనరావు, రాజ నర్సింహులు, పరుచూరి అశోక్ బాబు, దువ్వాడ రామారావు, దీపక్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు..
