Satish Kumar’s mysterious death: టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (AVSO) సతీష్ కుమార్ మరణానికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు ప్రస్తుతం పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలు కీలక ఆధారాలు లభించడంతో మరింత ఆసక్తి రేపుతుంది. అలాగే, సతీష్ కుమార్ పోస్టుమార్టం నివేదిక ఇంకా బయటకు రావాల్సి ఉంది. విచారణ సంస్థలు ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నాయి. పోస్టుమార్టంలో సతీష్ మరణ అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: Varanasi Glimpse: త్రేతాయుగ సీన్‌తో ‘వారణాసి’ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో ఫుల్ హైప్
కాగా, సతీష్ కుమార్ ట్రైన్ లో ప్రయాణించిన కోచ్‌లలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా A-1, A-2 కోచ్‌లలోని బెడ్‌రోల్ అటెండర్లను విచారణ చేశారు. సతీష్ కుమార్ ప్రయాణ వివరాలు, ఆయన కదలికలు, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అతడికి సమీపంలో ఉన్నారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే, సతీష్ కుమార్ అసలు సీటు నంబర్ 29 కాగా, సంఘటన అనంతరం సీట్ నెంబర్ 11 దగ్గర లగేజీ బ్యాగ్ లభించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సీట్ ఎలా మారింది? ఎవరు మార్చారు? ఇందులో ఎలాంటి కుట్ర ఉందిది? అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
