Suspence On Pawan Kalyan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర చేపట్టేందుకు సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే! ఈ నెల 14న ఉదయం 9 గంటలకు అన్నవరంలోని సత్యదేవుని దర్శనం, వారాహి వాహనానికి పూజలు నిర్వహించి.. సాయంత్రం 4 గంటలకు వారాహి యాత్ర ప్రారంభించాలని షెడ్యూల్ ఖరారు చేశారు. కానీ.. ఈలోపే కాకినాడ, కోనసీమ జిల్లాల్లో సెక్షన్ 30 అమలులో ఉంటుందని పోలీసులు ప్రకటన విడుదల చేయడంతో, జనసేన నేతలు మండిపడుతున్నారు. సరిగ్గా వారాహి యాత్ర సమయంలోనే ఆంక్షలు విధించడమేంటని విమర్శిస్తున్నారు.
Apsara Case: ఏంటి ఈ ట్విస్ట్.. అప్సరలకు ఇంతకు ముందే పెళ్లయిందా..!
అయితే.. ఈ వారాహి యాత్ర నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని జనసేన నేతలు కోరుతున్నారు. ఇప్పటికే అడిషనల్ ఎస్పీకి మినిట్ టు మినిట్ ప్రోగ్రాం షెడ్యూల్‌ని అందజేశారు. అయితే.. పోలీసుల అనుమతిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. జనసేన నేతలు మాత్రం అనుమతుల కోసం డీఎస్పీలకు ఎక్కడికక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాల పరిధిలో వారాహి యాత్ర, ఐదు బహిరంగ సభలకు సంబంధించిన షెడ్యూల్‌ని జనసేన పార్టీ విడుదల చేసింది. మరోవైపు.. ఈ నెల 11 నుంచి 30 వరకు సెక్షన్ 30 అమలులో ఉంటుందని కాకినాడ, కోనసీమ జిల్లాల డీఎస్పీలు చెప్తున్నారు. అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని తేల్చి చెప్తున్నారు.
Biporjoy Cyclone: మరింత తీవ్రమైన బైపోర్‌జోయ్ తుఫాను.. హెచ్చరికలు జారీ
ఇదిలావుండగా.. శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌లు విధించడం సర్వసాధారణమేనని, దీనిపై వస్తున్న అసత్య ప్రచారాల్ని నమ్మొద్దని అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ తెలిపారు. గతంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలను దృష్టిలో ఉంచుకునే ఈ సెక్షన్ 30ని విధించడం జరిగిందన్నారు. ఇది పోలీస్ డిపార్ట్‌మెంట్ రొటీన్‌గా చేసే పనే అనే స్పష్టతనిచ్చారు. అటు.. ఆదివారం అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభలు జరగనున్న రోడ్ మ్యాప్‌ను జనసేన నేతలతో కలిసి డీఎస్పీ అంబికా ప్రసాద్ పరిశీలించారు.