Site icon NTV Telugu

ఉద్యోగుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదన: కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి


ఉద్యోగుల ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదనను సీఎం జగన్‌ తీసుకొచ్చారని టీడీపీ జాతీయ ఉపాధ్యాక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కొత్త జిల్లాల విభజన దారుణంగా ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడే ధైర్యం లేదని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయలేదని ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. కొత్త జిల్లాల విభజన ఫేక్‌గా తయారైందన్నారు. సీఎం ను ప్రసన్నం చేసుకునేందుకు ఎమ్మెల్యేలు కొత్త జిల్లాల ఏర్పాటు పై సంబరాలు చేసుకుంటున్నారని సూర్యప్రకాష్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాల విభజన పై పునారాలోచించుకోవాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఇష్టానుసారంగా జిల్లాల విభజన ప్రక్రియ చేపట్టారని సూర్య ప్రకాష్‌ రెడ్డి విమర్శించారు.


Read Also: ఏపీ విద్యుత్‌ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌..త్వరలో డీఏ,పీఆర్సీ చెల్లింపు

Exit mobile version