NTV Telugu Site icon

YS Viveka Murder Case: సీబీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం.. కీలక ఆదేశాలు

Ys Viveka Murder Case

Ys Viveka Murder Case

YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేవకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. విచారణ అధికారిని మార్చాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది.. వివేకా హత్యకేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం… స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు.. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని నిలదీసింది.. విచారణ అధికారిని మార్చాలని ఆదేశాలు ఇచ్చింది.. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసిన రాజకీయ వైరం అని మాత్రమే రాశారని మండిపడ్డ కోర్టు.. విస్తృతస్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని అసహనం వ్యక్తం చేస్తూ.. తదుపరి విచారణ ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది.

Read Also: BJP Leader Murder: కలకలం రేపుతోన్న బీజేపీ నేత హత్య.. నాటు బాంబులతో దాడి, కత్తులతో నరికి..!

కాగా, వైఎస్‌ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ… వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ విచారణను జాప్యం చేస్తున్నారని, ఆయన్ను మార్చాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఇక, తులసమ్మ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ దర్యాప్తు తీరుపై అసహనం వ్యక్తం చేసింది.. ముఖ్యంగా రాజకీయ వైరం అని మాత్రమే రాసుకొచ్చారు.. కానీ, ఎక్కడా దానికి సంబంధించిన వివరాలను పొందుపర్చలేదని.. కుట్ర గురించి ఏ మాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వచ్చే నెల 10వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.