Site icon NTV Telugu

Supreme Court: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై కీలక ఆదేశాలు.. రేపటిలోగా వివరాలు సమర్పించాలి

Ab Venkateswara Rao

Ab Venkateswara Rao

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదోపవాదాలు జరిగాయి. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. సస్పెన్షన్‌ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు కోర్టుకు తెలిపారు.

అయితే రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా అని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రేపటిలోగా అన్ని వివరాలతో రావాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్‌ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రేపటి తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని సూచించింది. కాగా తదుపరి విచారణను శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Kakani Govardhan Reddy: మంత్రిగా తొలి సంతకం ఏ ఫైలుపై పెట్టారంటే..?

Exit mobile version