Covid Ex-Gratia: కోవిడ్ బాధితులకు పరిహారాన్ని అందజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. కోవిడ్ నష్టపరిహారాన్ని బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అందజేయకపోవడం అంశంపై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.. అయితే, వీలైనంత త్వరగా మొత్తం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.. ఇదే సమయంలో.. నష్టపరిహారం అందజేయని విషయాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అధారిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది.. కాగా, కోవిడ్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు.. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం.. కోవిడ్ బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది.. కాగా, కోవిడ్ బాధితుల కుటుంబాలకు పరిహారంపై పిటిషన్ దాఖలు చేసిన పల్లా శ్రీనివాసరావు తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది గౌరవ కుమార్ బన్సల్.
Read Also: CM YS Jagan: విద్యాశాఖపై సీఎం సమీక్ష.. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేయాల్సిందే..!
