Site icon NTV Telugu

మంత్రి ఆదిమూలపు ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు !

Adimulapu Suresh

Adimulapu Suresh

ఢిల్లీ : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు.. సి ఆర్ పి సి ప్రకారం ప్రాథమిక విచారణ అవసరం లేదని పేర్కొంది. ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే కేసు నమోదు చేయాలనే హక్కు నిందితుడికి లేదని…జస్టిస్ చంద్ర చుడ్ ధర్మాసనం తీర్పు ప్రకటించింది. ఇక ఈ కేసులో ప్రాథమిక విచారణ జరపకుండా సిబిఐ కేసు నమోదు చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు ఆదిమూలపు దంపతులు. ఈ నేపథ్యంలో ఆదిమూలపు దంపతుల వాదనను సమర్థించింది హైకోర్టు. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది సిబిఐ. ఈ తరుణంలోనే ఆదిమూలపు సురేష్ దంపతుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version