ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సరైన అధ్యాయం కసరత్తు లేకుండా పరీక్షలకు వెళ్తే విద్యార్థులు, సిబ్బంది ప్రమాదంలో పడతారు. అన్ని అంశాలపై అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సోమవారం అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వలని ఏపీ ప్రభుత్వం కోరింది. రేపే అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు… ఇతర బోర్డుల ఫలితాలు ముందుగా వస్తే విద్యార్థులకు ఇబ్బంది కాదా అని ప్రశ్నించింది. పరిక్షల నిర్వహణ పై యూజిసీ,సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ సలహాలు తీసుకోవచ్చు. గ్రేడింగ్ విధానం ఉందని, పరీక్షల నిర్వహణ ఒక్కటే మార్గం కాదు.ఇతర పరిష్కార మార్గాలు కూడా ఉంటాయన్న సుప్రీంకోర్టు… అన్ని కోణాల్లో పరిశీలించి పరీక్షలు నిర్వహించాలని జస్టిస్ మహేశ్వరి పేర్కొన్నారు. అయితే దీని పై రేపు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది కోర్టు.