Site icon NTV Telugu

Sunil Deodar: హిందూ దేవతల్ని అవమానిస్తారా?

Sunil1a

Sunil1a

ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ ‌జాతీయ కార్యదర్శి సునీల్ థియోదర్. హిందూ దేవతలను రాష్ట్రంలో అవమానిస్తున్నారు. అంతర్వేది రథదహనంతో ప్రారంభమై అనేక సంఘటనలు హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ సంఘటనలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి. మైనార్టీల ఓట్ల కోసం హిందూ దేవతలను అవమానిస్తారా?

పెదకాకాని ఆలయంలో ముస్లిం వ్యక్తి మాంసం వండటం హైందవ మతాన్ని అవమానించడమే. ఇంత దారుణం జరుగుతుంటే.. పోలీసులు , అధికారులు చోద్యం చూస్తున్నారు. జిన్నా టవర్ పేరు చెప్పగానే స్పందించిన వైసీపీ నాయకులు హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. జిన్నా కారణంగా లక్షల‌ మంది భారతీయులు మత కలహాలలో మృతి చెందారు. జగన్ ಓట్ల రాజకీయం చేస్తున్నారు. మైనార్టీలను బుజ్జగిస్తూ హిందువులను కించపరుస్తున్నారు. మాంసం వండిన వ్యక్తిని, ఆలయ డీసీని సస్పెండ్ చేయాలి. తిరుమలలో రాజకీయాలు చోటు‌చేసుకోవడమే అనర్థాలకు కారణం. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నం జరుగుతుంది.

Also Read: RTC Charges: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం.. కాసేపట్లో ప్రకటన..

తిరుమలలో దర్శనానికి వచ్చే భక్తులను జగన్ ప్రభుత్వం అవమాన పరచింది. విద్యుత్ కోతలు కారణంగా గత టీడీపీ ప్రబుత్వంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. విద్యుత్ సంక్షోభంపై పోరాటం చేసే‌ అర్హత టీడీపీకి లేదు.రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో‌ ఉంది.లిక్కర్,ఇసుక, ల్యాడ్ మాఫియాలను అధికార పార్టీ నాయకుల అండదడలతో కొనసాగుతుంది.జనసేనతో కలసి సొంత బలంతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు సునీల్ థియోదర్.

Exit mobile version