Site icon NTV Telugu

నేరం చేసిన వారెవ్వరిని వదిలిపెట్టం: హోం మంత్రి సుచరిత

నేరం చేసిన వారెవ్వరిని వదిలి పెట్టబోమని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుడారు. నేరాలు జరగటం లేదని మేం చెప్పడం లేదు.. నేరం జరిగితే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నిందితులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలి. పార్టీ ఏదైనా.. మహిళలపై చేయి వేస్తే ఉపేక్షించే ప్రభుత్వం మాది కాదని సుచరిత అన్నారు. గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46మందిని అరెస్టు చేశామని సుచరిత అన్నారు. విజవాడలో టీడీపీ కార్పొరేటర్‌గా పోటీ చేసిన వినోద్‌ జైన్‌ పైన కఠినంగా వ్యవహరిస్తామన్నారు. లోకేష్ పీఏ మహిళల్ని వేధిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయని హోం మంత్రి అన్నారు. ప్రతి మహిళా దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకుని పోలీసుల నుంచి రక్షణ పొందాలని సుచరిత కోరారు. ఎంతటి వారినైనా విచారించే విచక్షణ అధికారాలు పోలీసులకు కల్పించామని మంత్రి పేర్కొన్నారు.

Read Also: ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోం : బొత్స సత్యనారాయణ

Exit mobile version