Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sucharita Responds To The Girl Suicide

బాలిక కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తాం: హోం మంత్రి సుచరిత

Published Date :January 30, 2022 , 8:55 pm
By NTV WebDesk
బాలిక కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తాం: హోం మంత్రి సుచరిత
  • Follow Us :
  • google news
  • dailyhunt

విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన పై హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. 14 ఏళ్లు ఉన్న బాలిక భవనం మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్ జైన్ ఎంత దారుణమైన లైంగిక వేధింపులకు గురిచేసాడో, మానసిక వేదనకు గురిచేసాడో బాలిక ఆత్మహత్యను బట్టి అర్థమవుతుందన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు. బాధిత బాలిక కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ మంత్రి సుచరిత హామీ ఇచ్చారు. ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాలిక రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా నిందితుడు వినోద్ జైన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని పేర్కొన్నారు.

Read Also: ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు: బండి శ్రీనివాసరావు

టీడీపీ నాయకుడు మైనర్ బాలికతో అత్యంత అమానుషంగా వ్యవహరించినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు హోం మంత్రి సుచరిత. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ఎంతటి దుర్మార్గాలకు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఒక మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకొని కొట్టడం, కాల్ మనీ పేరుతో టీడీపీ నాయకులు దూరాఘతాలకు పాల్పడటం, మహిళను వివస్త్రను చేసి కొట్టడం లాంటి ఎన్నో ఘటనలు గతంలో చూశామని మంత్రి వెల్లడించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు ఆడబిడ్డల పుట్టుక గురించి మాట్లాడటం, నారా లోకేష్ మహిళల గురించి అవహేళనగా మాట్లాడటం చూశామని హోం మంత్రి సుచరిత అన్నారు.

Read Also: ఏపీలో కొత్తగా 10,310 కరోనా కేసులు

టీడీపీ ముఖ్య నాయకులు మహిళలను చిన్న చూపుతో చూడటం వల్లనే వినోద్‌ జైన్‌ లాంటి నాయకులు తయారవుతున్నారని హోం మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ గారు బాలిక ఆత్మహత్య ఘటన పై తీవ్రంగా స్పందించారన్నారు.మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం జగన్ గారు ఎన్నో సందర్భాలలో పేర్కొన్న విషయాన్ని హోంమంత్రి గుర్తుచేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షించే పూర్తి స్వేచ్ఛ ను పోలీసు శాఖకు సీఎం కల్పించారని హోం మంత్రి తెలిపారు. బాలిక మరణానికి కారణమైన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ కు కఠిన శిక్ష పడేలా పోలీసు ఉన్నతాధికారులను హోం మంత్రి సుచరిత ఆదేశించారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శించడం మానుకోవాలని హోం మంత్రి సుచరిత సూచించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • girl suicide case
  • mekathoti sucharitha
  • TDP Leader

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions