Site icon NTV Telugu

సుబ్బారావు గుప్తా దాడి కేసులో వైసీపీ నేత సుభానీ అరెస్టు

మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను….’ అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. సుబ్బారావు గుప్తాపై దాడిచేసిన సుభానీపై పోలీసులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు.

https://ntvtelugu.com/chandrababu-participated-in-the-semi-christmas-celebrations/

సుబ్బారావు గుప్తాపై దాడి కేసులో నిందితుడు వైసీపీ నేత సుభానీని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడంటూ సుబ్బారావు గుప్తాపై దాడికి దిగిన వైసీపీ నేత సుభానీ. ఈ వ్యవహారం కాస్త రచ్చకెక్కడంతో సీరియస్‌గా తీసుకున్న మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి. మంత్రి ఆదేశాలతో..బాధితుడి ఫిర్యాదు మేరకు సుభానీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మొత్తం బెయిలబుల్‌ సెక్షన్స్‌ కావడంతో 41 నోటిస్‌ ఇచ్చి ఇంటికి పంపించే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Exit mobile version