NTV Telugu Site icon

Loan App Harassment: లోన్ యాప్ వేధింపుల్లో ఊహించని ఘటన.. లోన్ తీసుకోపోయినా..

Loan App Harassment

Loan App Harassment

Strange Loan App Harassment In East Godavari Kadiyam: ఇన్నాళ్లూ అప్పు తీసుకున్న వారినే లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేసిన సంఘటనల్ని మనం చూశాం. అయితే.. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఎలాంటి లోన్ తీసుకోని ఓ మహిళ వేధింపులకు గురయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కడియం మండలంలో దేవి అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమెకు కొన్ని రోజుల కిందట ఒక గుర్తుతెలియని మొబైల్ నంబర్ నుంచి రూ.2వేలు ఫోన్ పే ద్వారా వచ్చాయి. అది గమనించిన ఆమె, వెంటనే ఆ డబ్బుల్ని తిరిగి అదే నంబర్‌కు వెనక్కు పంపించింది. అక్కడితో ఈ వ్యవహారం తెగిపోయిందిలే అని ఆమె అనుకునేలోపే.. అదే నంబర్ నుండి ఆమెకు వాట్సాప్ కాల్ వచ్చింది. తాను డబ్బులు తిరిగి పంపించానని చెప్పేందుకు ఆ కాల్ ఎత్తింది. కానీ.. ఆమెను ఫోన్ ఎత్తాక ఊహించని షాక్ తగిలింది.

Ambati Rambabu: సైకిల్ స్క్రాబ్‌గా మారింది.. మేనిఫెస్టో పేరుతో మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారు

అవతల ఫోన్ చేసిన వ్యక్తి.. హిందీ, ఇంగ్లీష్ భాషలో దుర్భాషలాడాడు. తనకు అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. లేకపోతే నీ ఫోటోలను న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే.. దేవి అతని మాటల్ని పెడచెవిన పెట్టింది. అదనపు డబ్బులు ఎందుకివ్వాలని అడిగింది. అనంతరం ఫోన్ కట్ చేసింది. దాంతో మండిపోయిన ఆ ఆగంతకుడు.. తాను చెప్పినట్లుగానే బాధితురాలి ఫోటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫోటోలను పంపించడం మొదలుపెట్టాడు. అతని ఆకృత్యాలు శృతిమించడంతో.. బాధితురాలు వెంటనే దిశా పోలీసులకు ఫోన్ చేసి, సమాచారం ఇచ్చింది. బాధితురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. దిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగంతకుడు కాల్ చేసిన ఫోన్ నెంబర్, ఇతర వివరాల ఆధారంగా.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

Harish Rao: మోడీ చెప్పేవన్నీ ‘టీమ్ ఇండియా’.. చేసేవి ‘తోడో ఇండియా’