Site icon NTV Telugu

నటుడిగా నేను రాజమండ్రిలోనే జన్మించా : చిరంజీవి

రాజమండ్రి హోమియోపతి మెడికల్ కళాశాలలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్ల్లాడుతూ.. నటుడిగా తాను జన్మించింది రాజమండ్రిలోనేనని.. తన మొదటి మూడు సినిమాలు రాజమండ్రి ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయని వెల్లడించారు. తనది అల్లు రామలింగయ్యగారిది గురు – శిష్యుల సంబంధమన్నారు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తనకు కడుపులో మంట వచ్చేదని… ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదన్నారు.

అల్లు రామలింగయ్యగారు ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పి తీసినట్లు పోయిందని… ఇవాళ్టికీ మా ఫ్యామిలీ హోమియోపతి మందులే వాడతామని స్పష్టం చేశారు. హోమియోపతిలో తగ్గని జబ్బు లేదని.. రాజ్యసభ ఎం.పి.గా ఉండటం వల్లే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు ఇవ్వగలిగానని చెప్పారు. సంజీవని లాంటి హోమియోపతి వైద్యం
చిరంజీవిగా ఉండాలని… హోమియోపతి సైడ్ ఎఫక్ట్స్ లేని వైద్యమన్నారు.

Exit mobile version