Site icon NTV Telugu

SS Rajamouli: సీఎం సానుకూలంగా స్పందించారు..

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తాజా మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌.. ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఇక, ప్రభుత్వం సినిమా టికెట్ల వివాదానికి తెరదింపుతూ కొత్త జీవోను విడుదల చేసిన నేపథ్యంలో.. ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు దర్శకుడు రాజమళి, నిర్మాత డీవీవీ దానయ్య.. సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి, దానయ్య.. మీడియాతో మాట్లాడారు.. సీఎం వైఎస్‌ జగన్‌ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్‌ సినిమా కావున.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.. సీఎం మాతో బాగా మాట్లాడారని.. సమస్యలపై సానుకూలంగా స్పందించారని తెలిపారు రాజమౌళి..

కాగా, ఆర్‌ఆర్‌ఆర్ మూవీ.. ఈనెల 25వ తేదీన విడుదలకాబోతోంది.. దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీలో రామ్‌ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు… ఇక, ఆలియా భట్, ఒలీవియా మోరిస్​హీరోయిన్లుగా.. అజయ్​దేవ్‌గన్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాత డీవీవీ దానయ్య కాగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ భారీ బడ్జెట్‌ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.. అదేస్థాయిలో ప్రీ బిజినెస్‌ కూడా చేస్తోంది ఆర్‌ఆర్‌ఆర్ మూవీ.

Exit mobile version